– సామాజిక వర్గ పొందికలో డాక్టర్ అమృతపాణికి అవకాశం
– వైసిపి రాజ్యసభ సీట్ల ఎంపికలో కొత్త మలుపు
– నలుగురిలో ఒక ఎస్సీకి అవకాశం
అమరావతి : వైయస్సార్ సిపి లో రాజ్యసభ సీట్ల ఎంపిక పై ఆసక్తికర పోటీ నెలకొంది. పార్టీ బలపరచాలని బట్టి వైయస్సార్ సిపి కి నాలుగు స్థానాల వరకు రానున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. సామాజిక న్యాయ దృక్పథంతో ఒక స్థానాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించనున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. నిన్నటి వరకు నాలుగు స్థానాల్లో నలుగురు ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన పార్టీ సీనియర్ నేతల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే తాజాగా రిజర్వేషన్ల అంశం ముందుకు రావడం, శాసన మండలి రద్దు కావడంతో ప్రకాశం జిల్లా చీరాల నుండి గతంలో పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి పేరు ప్రస్తావనకు రావడం చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
వైయస్సార్సీపి రాజకీయాల్లో ప్రకాశం జిల్లాలో వరికూటి సోదరుల కృషికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. గత ఎన్నికల సమయంలో ఒకే కుటుంబం నుండి ఇద్దరికీ ప్రాధాన్యత ఇవ్వలేమని నిబంధనలతో ఎవరికైనా ఒకరికి ఏ అవకాశం ఇవ్వగలము అన్నా ప్రతిపాదన ముందుకు తీసుకు వచ్చారు. ఆ సమయంలో డాక్టర్ వరికూటి అమృతపాణి తన సోదరుడు అశోక్ బాబుకు అవకాశం ఇవ్వాలని కొండేపి నియోజకవర్గం నుండి ప్రతిపాదించారు. అయితే కొండేపి నియోజకవర్గం లో ఏర్పడిన రాజకీయ వైరుధ్యాలు నేపద్యంలో అశోక్ బాబుకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నామినేటెడ్ పదవుల్లో వరికూటి బ్రదర్స్కు ఏదో ఒక రూపంలో సముచిత న్యాయం చేస్తామన్న జగన్ హామీ తాజాగా రాజ్యసభ సీట్ల ఎంపికలో డాక్టర్ వరికూటి అమృత పార్టీకి అవకాశం వస్తుంది అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. చీరాల నియోజకవర్గంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలను కాపాడుకునేందుకు మరో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను పార్టీ రాష్ట్ర నాయకత్వం గుర్తించిందని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ అమృతపాణికి అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.