చీరాల : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న చల్లారెడ్డిపాలెం, జగన్నాధపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, గవిని వెంకటరావు, కటకం శ్రీనివాసరావు, వి పోతురాజు, నాగేంద్రమ్మ, గవిని రాదయ్య పాల్గొన్నారు.