టంగుటూరు : జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మండలంలోని కారుమంచిలో రైతుభరోసా కేంద్రాన్ని వైసీపీ సీనియర్ నాయకులు సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి, సూరం రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలంలో రైతులకు, గ్రామీణ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సేవలను గుర్తుచేశారు. సీఎంకు అభినందనలు తెలియజేస్తూ ఏర్పాటు చేసుకున్న పండుగే రైతుభరోసా అన్నారు. రైతుభరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిపరిణామం అన్నారు. గ్రామీణుల ఉపాధి పెరగాలని, రైతులు ఎదగాలని రైతుపక్షపాతిగా ముద్రవేసుకుని ప్రజారంజక పాలన చేస్తున్న జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేయాలని అన్నారు.
వల్లూరమ్మ దేవాలయ చైర్మన్ సూరం రమణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేరు రైతుల జీవితాలలో నిలిచిపోయే రోజన్నారు. ఏడాదికి రైతుకు రైతుభరోసాగా 13,500 ఇస్తున్నారన్నారు. గ్రామ ప్రజలకు పార్టీలకు అతీతంగా ఏ సహాయం చేయడానికైనా మీకు అందుబాటులో ఉంటామన్నారు. ముందుగా స్థానిక చెరువుగట్టుపై ఉన్న వైస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారిని ధనలక్ష్మి, విఆర్ఒ జయరాజు, సచివాలయ వ్యవసాయాధికారిని సాయిలక్ష్మి, గ్రామ వైసీపీ నాయకులు బాలకోటిరెడ్డి, బత్తుల శ్రీనివాసులు పాల్గొన్నారు.