టంగుటూరు : పంచాయతీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని పిడిసిసి చైర్మన్, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య ప్రారంభించారు. మండలంలోని కాకుటూరివారిపాలెం, తూర్పు నాయుడుపాలెం, మర్లపాడు, అనంతరం గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది కాలంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సిహెచ్ కృష్ణ, టంగుటూరు సొసైటీ చైర్మన్, వైసీపీ మండల నాయకులు రావూరి అయ్యవారయ్య, వ్యవసాయాధికారిని స్వర్ణకుమారి, ఎఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు పాల్గొన్నారు.