Home సినిమా ‘రథేరా’ టీజర్ బాగుంది: పృథ్వీ

‘రథేరా’ టీజర్ బాగుంది: పృథ్వీ

467
0

పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రథేరా’. జాకట రమేష్ ఈ సినిమాను తెరకెక్కించగా పూల సిద్దేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూసిన నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ…

అమీర్ ఖాన్ చేసిన ‘దంగల్’ చిత్రం తరహాలో ‘రథేరా’ చిత్రం ఉండబోతోందన్నారు. లోకల్ ట్యాలెంట్‌తో అందరూ కొత్తవారు చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను రింగ్ టోన్స్‌గా పెట్టుకోవచ్చని, అంత క్యాచీగా డైలాగ్స్ ఉన్నాయని చెప్పారు. సినిమా హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నానన్నారు.

నిర్మాత, హీరో జుకేట్ రమేష్ మాట్లాడుతూ
ఖోఖో నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పారు. తమ సినిమా టీజర్‌ను విడుదల చేసిన వి.వి.వినాయక్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనవరి 2020 మొదటివారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ తమ ‘రథేరా’ సినిమా టీజర్‌ను చూసిన కొందరు సినీ ప్రముఖులు అభినందించారని చెప్పారు. సినిమా విడుదల తరువాత ఆడియన్స్ నుంచి అదే ఫీడ్ బ్యాక్ వస్తుందని నమ్ముతున్నానన్నారు.