Home బాపట్ల విద్యార్ధులకు క్విజ్‌ పోటీలు

విద్యార్ధులకు క్విజ్‌ పోటీలు

31
0

చీరాల (Chirala) : రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా స్థానిక రోటరీ సామాజిక భవనంలో నిర్వహిస్తున్న యువజన వారోత్సవాల్లో భాగంగా శనివారం 7వ రోజు క్విజ్ పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల నుండి 145 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ మాష్టర్ దోగుపర్తి వెంకట సురేష్, వలివేటి మురళీకృష్ణ, పోలుదాసు రామకృష్ణ, శివాంజనేయ ప్రసాద్, రమేష్ బాబు, మురళీమోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, ఎంవి రామారావు, ఎస్‌విస్వామి, కోదండరామ్, గుద్దంటి రమేష్ బాబు, బాల వెంకటేశ్వరరావు, జివై ప్రసాద్, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.