పురందేశ్వరి : తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారు: పురందేశ్వరి
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి నియామకాలపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు..
బోర్డు సభ్యులుగా శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ నియామకమే ఇందుకు నిదర్శనమన్నారు. దిల్లీ మద్యం స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఎంసీఐ స్కామ్‌లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని భాజపా ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు.