Home బాపట్ల నేడు కలెక్టరేల్‌లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌)

నేడు కలెక్టరేల్‌లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌)

30
0

• అన్ని శాఖల అధికారులు పిజిఆర్ఎస్‌కు హాజరు కావాలి
• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అధికారులతో సమావేశం
• గత వారం ఇచ్చిన అర్జీలపై అధికారులతో సమీక్ష
• కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్
బాపట్ల (DN5 News) : ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేzHలో నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలపై ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ తోపాటుగా ప్రతి రెవెన్యూ డివిజన్, తహశీల్దారు కార్యాలయాల్లోను తహశీల్దార్లు, ఎంపిడిఓలు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

అర్జీదారులు అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు అర్జీలు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని సూచించారు. పిజిఆర్ఎస్ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని తెలిపారు.