బాపట్ల (DN5 News): ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పిజిఆర్ఎస్ (PGRS) కార్యక్రమం ఈనెల 9న సోమవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. కార్యక్రమానికి శాఖలలోని అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు అవుతారని తెలిపారు. కావున బాపట్ల జిల్లా కేంద్రం కలెక్టరేట్‌కు సోమవారం ఎవ్వరు అర్జీలను తీసుకొని రావద్దని తెలిపారు.
ఉదయం 9 నుండి 10 వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో, తహశీల్దార్లు కార్యాలయాల్లో తహశీల్దార్లు, ఎంపీడిఓలు ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.
అర్జీదారులు పిజిఆర్ఎస్‌లో అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని, Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని తెలిపారు.






