Home బాపట్ల విద్యారంగ అభివృద్దికే పిటిఎం

విద్యారంగ అభివృద్దికే పిటిఎం

7
0

చీరాల (Chirala) : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ డే కార్యక్రమాన్ని చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య (MLA Kondaiah) హాజరయ్యారు. విద్యార్థినిలతో ముఖాముఖీ జరిపిన ఎమ్మెల్యే అనంతరం మాట్లడారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని ప్రాధాన్యంగా తీసుకొని పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు, విద్యార్ధుల భవిష్యత్తుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని అన్నారు. ‘చేయి చేయి కలుపుదాం, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారతాన్ని నిర్మిద్దాం’ అని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, ఆప్కో చైర్మన్ డాక్టర్‌ సజ్జ హేమలత, మున్సిపల్ ఛైర్మన్ మీంచాల సాంబశివరావు, కూటమి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అధికారులు పాల్గొన్నారు.