Home ఆంధ్రప్రదేశ్ జకార్… నోరు జారాడు… పదవి ఊడింది : ఎస్విబిసి ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా

జకార్… నోరు జారాడు… పదవి ఊడింది : ఎస్విబిసి ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా

370
0

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పృథ్వీరాజ్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఆడియో టేపుల వ్యవహారంపై దుమారం రేగడంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేశారు.  సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్‌ను టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు. దాంతో ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

” నాపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నా.  సంక్రాంతి సమయంలో నా కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. నా వాయిస్ మార్ఫింగ్ చేశారు. ఫేక్ వాయిస్ పెట్టి నన్ను అప్రతిష్టపాలు చేశారు. పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించాలి. అందుకే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా. నన్ను కొందరు దెబ్బకొట్టాలని చూశారు. నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీసిన ప్రతిపక్షాలుకు నా సెల్యూట్.” అంటూ పద్మావతి గెస్ట్ హౌస్‌ విలేకరులతో చెప్పారు.