వేటపాలెం: విపత్కర పరస్తితుల్లో ప్రవేటు పాటశాలల సిబ్బంది ధైర్యాన్ని వీడవద్దని అపుస్మా నియోజకవర్గ అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని శ్రీఅనుజ్ఞ హైస్కూల్ లో మంగళవారం శ్రీ వివేక ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో కిరాణా ఓచర్లు పంపిణీ చేశారు. సీఈసీ కాలేజి సీఈఓ వి మురళీ కృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాసులు వంటివి నిర్వహించే సామర్ధ్యాన్ని ఉపాధ్యాయులు పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీ మేధావి కాలేజి డైరెక్టర్ ఎం దుర్గాకుమార్, వేటపాలెం ఎస్ఐ వి అజయ్ బాబు, శ్రీ వివేకా స్కూల్ హెచ్ఎం వి రాజశేఖర్, జోసఫ్ హై స్కూల్ హెచ్ఎం పాటిబండ్ల కృష్ణారావు, ట్రిపుల్ ‘కె’ స్కూల్ హెచ్ఎం సత్యవాణి, బ్రిలియంట్ స్కూల్ హెచ్ఎం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.