Home ప్రకాశం మారేళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

మారేళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

651
0

ఒంగోలు : కీర్తి శేషులు మారెళ్ళ వెంకటేశ్వర్లు 16వ వర్ధంతిసందర్భంగా ఒంగోలు బలరాం కాలనీలోని కసుకుర్తి కోటమ్మ నిర్వహిస్తున్న ఉషోదయ వృద్దాశ్రమంలో మారెళ్ళ వెంకటేశ్వర్లు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరవస్తువులు, పళ్ళు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సెయింట్ తెరిస్సా స్కూల్ ఎన్సిసి ఆఫీసర్ బొంతుఆనందరవు ముఖ్యఅతిథిగా హాజరై ట్రస్ట్ సేవలను అభినందించారు. 16 సంవత్సరాలుగా తండ్రి పేరుతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ పేదలకు సేవచెయ్యడం అభినందనీయమని అన్నారు. ఒంగోలు నగరాభివృద్ది కమిటీఅధ్యక్షుడు మారేళ్ళ సుబ్బారావు, సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు, చైతన్య స్వరభారతి అధ్యక్షుడు నూకతోటి శరత్ బాబు, భరత్ పాల్గొన్నారు.