చీరాల : కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చీరాల పట్టణం దండుబాట వద్ద గల మురుగు కాలవ దగ్గర ఉన్న ఎస్టీ కాలనీ నందు ఉన్న పేద కుటుంబాలకు సోమవారం ఉదయం 8.00 గంటలకు బియ్యం, నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు, సబ్బులు, కూరగాయాలను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ సి ఈ యు ) చీరాల యూనిట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు టి విజయ కుమార్, చీరాల ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ యస్ శ్రీనివాసరావు, ఆఫీసీర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్ యన్ బెన్నీ, సిబ్బంది, సిఐటీయు నాయకులు వసంతరావు, ఎఎంసి ఛైర్మన్ మార్పు గ్రగోరి, మాజీ కౌన్సిలర్ జి సత్యనారాయణ, వైకుంటపురం నాయకులు జి శ్రీహరి పాల్గొన్నారు.