కొండపి : కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడడం కోసం రాత్రిమ్భవళ్లు అలుపెరుగక సేవ చేస్తున్న పోలీసు కుటుంబాలకు చింతల ఎక్ స్పోర్ట్ అధినేత చింతల వెంకటేశ్వర్లు నిత్యవసర సరుకులను కొండపి పోలీస్ సిబ్బందికి సింగరాయకొండ సిఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ ప్రసాద్ చేతుల మీదగా అందజేశారు.
ఈ సందర్భంగా చింతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాసేవలో నిత్యం పనిచేస్తున్న వారికి తనవంతు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ సిబ్బందికి ఒక్కొక్కరికి 25కేజీ బియ్యం, 5 కేజీలు కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హనుమంతరావు, పోలీస్ సిబ్బంది, గుమ్మళ్ళ శ్రీహరి, మండవ మాలకొండయ్య, సుబ్బయ్య, శ్రీను, వెంకటేశ్వరరావు ఉన్నారు.