Home ప్రకాశం పోలీసు కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

పోలీసు కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

302
0

సింగరాయకొండ : కరోనా మహమ్మారి ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రజల ప్రాణాలను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22నుండి ‘లాక్ డౌన్’ విధించాయి. అప్పటినుండి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు రాత్రింబవళ్ళు నిద్రహారాలుమాని పోలీసులు శ్రమిస్తున్నారు. పోలీసులు ఎక్కడెక్కడో తిరిగి తమ ఇళ్లకు వెళ్లి భార్యాపిల్లలతో మాట్లాడలన్నా, పిల్లలను ముద్దుగా దగ్గరికి తీసుకోవాలన్నా సాహసించలేని దైన్యస్థితి. ఐనా వృత్తి ధర్మంతో ప్రజలను ఇళ్లల్లో నుండి బయటకు రాకుండా చేయడమే కాక ఎక్కడైనా కరోనా అనుమానితులు ఉన్నారంటే క్షణాల్లో అక్కడికి వెళ్లి ప్రాణాలను సైతం లెక్కచేయక దగ్గరుండి అనుమానితులను వైద్యశాలకు తరలిస్తున్నారు.

ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచి కడుపునిండా తిండి కూడా సరిగా తినక నిరంతరం సేవ చేస్తున్న తమ తోటి పోలీస్ సిబ్బందికి సింగరాయకొండ సీఐ యు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని సింగరాయకొండ, టంగుటూరు, కొండేపి, జరుగుమల్లి ఎస్సైలు శ్రీనివాసరావు, వైవి రమణయ్య, యన్సి ప్రసాద్, సోమశేఖర్ లు ఫ్రెండ్లీ పోలీస్ మైత్రి బంధంతో తమ తమ స్టేషన్ పరిధిలో తమతో పాటు నిరంతరం సేవాలందిస్తూ ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచిన సిబ్బందికి ఆయా మండలాల్లోని దాతలు ఔదార్యంతో షుమారు 85మంది పోలీస్ సిబ్బందికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, వంట నూనె ప్యాకెట్స్, మాస్కులు, శానిటయిజర్స్, కళ్ళజోళ్ళు, టోపీలు ఉచితంగా అందజేశారు. పోలీసులు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా దాతలు అభినందించారు.