Home ప్రకాశం 120చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

120చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

278
0

చీరాల : కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇళ్ల కే పరిమితమైన చేనేత కార్మికులకు ఏం సి మాజీ చైర్మన్, చేనేత నాయకులు జంజనం శ్రీనివాసరావు, పద్మశాలీయ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటి సభ్యులు గోలి వెంకట మల్లిఖార్జునుడు చేతుల మీదుగా చీరాల పట్టణం 11వ వార్డు ముత్యాలపేటలోని 120పేద చేనేత కార్మికుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందజేశారు.

ఈ ఈ సందర్భంగా జనం శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు నెలలుగా ఉపాధి లేక పూట గడవడానికి ఇబ్బందిపడుతున్న చేనేత కార్మికులను గుర్తించి వారికి చేయూతనిచ్చిన ముత్యాలపేట నివాసితులైన చేనేత కుటుంబమునకు చెందిన రామనాధం చెన్నకేశవులు, రామనాధం నాగేశ్వరావు, రామనాధం ఉమా మహేశ్వరావులను అభినందించారు. రామనాథం సోదరులు సొంత నిధులతో నిత్య అవసర సరుకులైన బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు, పెద్ద ఉల్లిపాయలు 120కుటుంబములకు పంపిణి చేశారు. కార్యక్రమంలో స్థానిక చేనేతలు పులిమి సత్యం, ఎ శ్రీనివాసరావు, గోలి శ్రీను, బిట్రా కోటేశ్వరరావు, గట్టు వెంకట సుబ్బారావు, పులిమి సాంబశివరావు, శంకర్ మాస్టారు పాల్గిన్నారు.