చీరాల : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపుమేరకు సామాజిక బాధ్యతతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఈపూరుపాలెం, సావరపాలెం, బుర్లవారిపాలెం, గవినివారిపాలెం, రామకృష్ణాపురం, సాల్మన్ సెంటర్ ప్రాంతంలో పేదలు, పంచాయతీ కార్మికుల 187కుటుంబాలకు రు.55వేల విలువైన నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు గౌరబత్తిన సూరిబాబు, షేక్ జానీబాషా, మొలబంటి వెంకటేశ్వర్లు, బొడ్డు బాలచంద్ర, మల్లెల రవి, టి నాగేశ్వరరావు, ఆర్ ఆంజనేయులు, సీతారామరాజు, ఎడి బాలాజీ, ఎం శ్రీనివాసులు, ఈ హనుమంతరావు, టీవీ కేశవస్వామి, సిహెచ్ వెంకటేశ్వరరావు, బి చంద్రశేఖరరావు, పీ సురేష్, సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరరావు, కె వీరాంజనేయులు, చేబ్రోలు సతీష్, శ్రీనాథ్, సిహెచ్ వి సుబ్బారావు, బి పిచ్చయ్య, జెవివి నాయకులు కుర్ర రామారావు, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, దేవతోటి నాగేశ్వరరావు, ఎన్జీవో నాయకులు బి హరిప్రసాద్ పాల్గొన్నారు.