Home ప్రకాశం యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చేయూత

యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చేయూత

303
0

టంగుటూరు (దమ్ము) : మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా కరోనా లాక్ డౌన్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చేయూతగా గత కొన్ని నెలలుగా యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదొక విధంగా భరోసాగా నిలిచింది. ప్రకాశం జిల్లా టంగుటూరు అరుంధతినగర్ కు చెందిన నిరుపేద సిద్ధవరపు చెంచయ్య కుటుంబానికి యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దేవరపల్లి చంద్రశేఖర్, కురుగుంట్ల ప్రవీణ్, చల్లాపల్లి సుబ్బారావు, చాట్రగడ్డ శ్యామ్, పూజల శివకుమార్, కొమ్ము సురేంద్రలు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు తమ ఆర్గనైజేషన్ ద్వారా తమ సంస్థ సభ్యులు సొంత నిధులతో పాటు దాతల సహాయ, సహకారాలతో నిత్యవసర సరుకులు, దుప్పట్లు, ఏదొక రూపంలో నిస్వార్ధంతో నిరుపేద కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సేవాకార్యక్రమానికి ఆర్డక సహకారం అందజేసిన స్థానిక భవాని ఫర్నీచర్ షాపు యజమాని కొల్ల సాయినాధ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సంస్థ ద్వారా చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న దాతలకు, ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.