కొండపి : పెరిదేపిలో వైసీపీ ఆధ్వర్యంలో పిసిసి బ్యాంక్ చైర్మన్, కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య చేతుల మీదుగా కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 650 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కందిపప్పు, నూనె, గోధుమపిండి, కోడిగుడ్లు, కూరగాయలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోపర్తి నారాయణ, ముప్పరాజు సుబ్బారావు, గోగినేని వెంకటేశ్వర్లు, గంటినపల్లి మల్లిఖార్జునరావు, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పుట్టా బ్రహ్మయ్య, చింతపల్లి ప్రసాద్, లేఖరాజు శ్రీను, బిరుదుల యల్లమందయ్య, ఎంపీటీసీ అభ్యర్థిని గంటినపల్లి మాలతి పాల్గొన్నారు.