చీరాల : కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకోవాలనే సామాజికస్పృహతో ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) వేటపాలెం మండలశాఖ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఏప్రిల్ 18, 19తేదీల్లో రెండు విడతలుగా పంపిణీ చేశారు. లాక్ డౌన్ పొడిగించిన కారణంగా పనులు లేక పస్తులుంటున్న నిరుపేదలకు ఆపన్నహస్తం అందించాలనే తలంపుతో మూడవ విడతగా నిత్యావసరాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ సభ్యులైన తవ్వ శ్రీనివాసరావు, సిహెచ్ బాల సుబ్రహ్మణ్యం, పి రవీంద్ర పాల్గొన్నారు.
మండలశాఖ ఆర్థికనిధులతో చీరాల ఇంజనీరింగ్ కాలేజి వెనుక వైపున ఉన్న ఎస్టీ కాలనీలోని 70కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రు.108000/-లతో వేటపాలెం శాఖ ద్వారా 225కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శులు షేక్ జానిబాషా, జి సూరిబాబు, ఎయిడెడ్ కన్వీనర్ కె వీరాంజనేయులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్ల వెంకటేశ్వర్లు, ఎస్ సాంబశివరావు, కోశాధికారి సిహెచ్ సతీష్, యానాదికాలని యుపి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ పద్మావతి, ఉపాధ్యాయులు తవ్వ శ్రీనివాసరావు, కల్యాణి, కే చిన్నోడు, ఎం రాజేశ్వరి పాల్గొన్నారు.