చీరాల : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపుమేరకు సామాజిక బాధ్యతతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న బెస్తపాలెం, గాంధీనగర్ ప్రాంతంలో 160మందికి ఈ నెల 8న నిత్యావసర సరకులు మొదటి విడత పంపిణీ చేశారు.
మరికొంతమంది ఉపాధ్యాయులు సహృదయుంతో అందించిన విరాళంతో రెండవ విడత ఈ నెల 17న దండుబాట సమీపంలోని ప్రకాష్ నగర్, యానదికాలని లోని 53నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు రూ.60,000/- విలువైన సరుకులు అందించిన ఉపాధ్యాయుల పట్ల ప్రజలు కృతజ్ఞతాభావం చూపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు పీ సురేష్, షేక్ జానిబాషా, ఎస్వి సుబ్బారెడ్డి, బి పిచ్చయ్య, సిహెచ్ వెలుగొండారెడ్డి, ఎన్ రాజేష్, ఎస్డి జానిభాషా పాల్గొన్నారు.