చీరాల : కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ పిలుపుమేరకు చీరాల పట్టణం బెస్తపాలెంలో పని లేక ఇబ్బంది పడుతున్న దినసరి కూలీ కార్మికులు 30 కుటుంబాలకు, 30మంది యువకులకు యూటీఎఫ్ సహాయ కార్యక్రమాల్లో భాగంగా చీరాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం గాంధీనగర్ లోని 110 కుటుంబాలకు సుమారు రూ.50,000 విలువచేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మున్సిపల్ కమీషనర్ కె రామచంద్రారెడ్డి విచ్చేసి యూటీఎఫ్ ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతగా చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. పేదప్రజలకు బియ్యము, కందిపప్పు, సన్ఫ్లవర్ ఆయిల్, గోదుమపిండి , ఉల్లిపాయలు ఇచ్చారు. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా యుటిఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలకు సమాజ నిర్మాతలైన ఉపాధ్యాయులు మానవత్వంతో సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు షేక్ జానీభాషా, ఎస్వీ సుబ్బారెడ్డి, కుర్రా శ్రీనివాసరావు, పి సురేష్, కె వీరాంజనేయులు, సిహెచ్ వెలుగొండారెడ్ది, ఎన్ రాజేష్ , జి సూరిబాబు, కుర్రా రామారావు, గవిని నాగేశ్వరరావు, సయ్యద్ జానీబాషా, బి పిచ్చయ్య, పి చంద్రారెడ్డి, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, అంగన్వాడీ నాయకులు రేఖ ఎలిజబెత్, సంధ్య, సులోచన, అరుణ పాల్గొన్నారు.