Home ప్రకాశం రామకృష్ణాపురంలో చేనేతలకు నిత్యావసరాల పంపిణీ

రామకృష్ణాపురంలో చేనేతలకు నిత్యావసరాల పంపిణీ

301
0

చీరాల : పద్మశాలీయులు ఎక్కువగా నివసించే రామకృష్ణాపురంలో కరోనా లాక్ డౌన్ కాలములో చేనేతపై జీవిస్తున్న వందలాది పద్మశాలీయులు పని లేక, బయటకు రాలేక, “నాడి” ఆడక, జీవనాధారం లేని చేనేతలకు విజయవాడ పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్, చీరాల కమిటీ సభ్యుల ఆర్థిక సహాయం తోపాటు రామకృష్ణాపురంలోని పద్మశాలీయ పెద్దలు వింజమూరి నరసింహరావు, గుర్రం సీతారామాంజనేయులు, వాసు బాలాజీ, గుర్రం శ్రీనివాసులు, తేళ్ల నరసింహస్వామి, దివి జయరాం, అందే బాబూరావు, గోలి బాలశరత్ కుమార్, గోలి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిటిసి గోలి నాగరాజు ఆర్థిక సహాయముతో150 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యము, 1కేజీ కందిపప్పు, 3కేజీల కూరగాయలు, 1కేజీ ఉల్లిపాయలు, 1కేజి ఆయిలు, 1కేజీ గోధుమలు, 2సబ్బులు, శానిటైజర్లలతో కలిపిన కిట్లను పీఐడబ్ల్యూఎ చీరాల బ్రాంచి అధ్యక్షుడు డాక్టర్ జి పున్నారావు, కార్యదర్శి ఊట్ల వెంకటేశ్వర్లు, బిసి కమిషన్ మెంబర్ అవ్వారు ముసలయ్య, ఉడతా రమేష్, ఆలూరి శ్రీనివాసరావు, గోలి ఆనందరావు, గోలి దేవేంద్రనాధం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.