Home ప్రకాశం 163నాయి బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

163నాయి బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

269
0

చీరాల : కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన నాయి బ్రాహ్మణ కుటుంబాలకు చీరాల, పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున డాక్టర్ హైమ సుబ్బారావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో వైకుంఠపురం ప్రెసిడెంట్ మాచవరం వెంకటేశ్వర ఇంటివద్ద, పోలేరమ్మ గుడి వద్ద, వల్లూరి వెంకటస్వామి ఇంటివద్ద, పేరాల గొల్లపాలెం వల్లూరి సుబ్బారావు ఇంటివద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు, తాడివలస దేవరాజు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని కోరారు.

చీరాల, పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ప్రతినిధులు ఎం వెంకటేశ్వర్లు, కే సత్యనారాయణ, నూకరాజు, వల్లూరి సుబ్బారావు, ఎం సత్యం, సుబ్బారావు, బోసుబాబు, వి శ్రీను, వెంకటస్వామి పాల్గొన్నారు.