Home ప్రకాశం కెవిపిఎస్, ఏఎఫ్ఎల్ సి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

కెవిపిఎస్, ఏఎఫ్ఎల్ సి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

413
0

చీరాల : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏ ఎఫ్ ఎల్ పి చర్చి ఆధ్వర్యంలో కొత్తపేట పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, సరళ కుమారి, చర్చి పాస్టర్ దాసరి లూధరన్ శాస్త్రి, డాక్టర్ ఆనంద్ సహకారంతో రెండో పట్టణ సిఐ ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా అందజేశారు. మాస్కులు, శానిటైజర్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం బాబురావు, డి నాగేశ్వరరావు, ఎం వసంతరావు, జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామారావు, యుటిఎఫ్ నాయకులు కే వీరాంజనేయులు, గవిని నాగేశ్వరావు, షేక్ జానీ బాషా, ఇండ్ల చైతన్య, పంచాయతీ కార్యదర్శి గౌస్, పాస్టర్ ఇమ్మానియేల్, దావీదు, శ్రీ రాములు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.