జరుగుమల్లి : కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ కటారపు రాజు తనవంతు సహాయం అందించారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన 200పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు కొంత భరోసాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణల పిలుపు మేరకు పేదలకు నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు పిల్లి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సెగ్గం శ్రీనివాసరావు, జరుగుమల్లి మండల అధ్యక్షులు ఇత్తడి అక్కయ్య, రైతు విభాగం నాయకులు బెల్లం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.