Home ప్రకాశం 210కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ : జూపూడి

210కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ : జూపూడి

330
0

కొత్తపట్నం : మాజీ ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్, మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు స్వగ్రామమైన సంకువారిగుంటలో 210 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు. జూపూడి భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త, చింతల గ్రానైట్స్ అధినేత చింతల వెంకటేశ్వర్లు, బాలినేని బావమరిది సుంకర ఓబుల్ రెడ్డిల సారధ్యంలో ప్రారంభించారు.

గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5కేజీల బియ్యం, అరకేజీ కందిపప్పు, ఆరు కేజీల కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొండపి మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ చింతపల్లి హరిబాబు, సూదనగుంట నారాయణరావు, జూపూడి రవికుమార్, వైస్సార్ సీపీ నాయకులు, జూపూడి అభిమానులు పాల్గొన్నారు.