వేటపాలెం : పెద్దబజార్, చిన్నబజార్లోని 550కార్మిక కుటుంబాలకు మేడే సందర్భముగా వైసిపి ఇంచార్జ్, మాజీ ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా ఉచితముగా కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పనులులేక ఇబంది పడుచున్న కుటుంబాలకు మేడే కార్మిక దినోత్సవము సందర్భముగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు చీరాల వైస్సార్సీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆద్వర్యములో వేటపాలెం మాజీ సర్పంచ్, వైస్సార్సీపీ నాయకుడు సయ్యద్ షమీమ్, హనీఫ్, వసీం సహకారముతో 550 మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 8కేజీల కూరగాయలు ఉచితముగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియచేశారు. కార్మికులకు పేదలకు ఇటువంటి సహాయాన్ని అందచేసినందుకు షమీమ్ ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ షేక్ సత్తార్, చల్ల రామమోహన్, దావులూరి శ్రీను, షేక్ బాబు, కజ్జి, గ్రామ సెక్రటరీ, వాలంటీర్లు పాల్గొన్నారు.