Home ప్రకాశం రంజాన్ సందర్బంగా 350ముస్లిం కుటుంబాలకు జంజనం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

రంజాన్ సందర్బంగా 350ముస్లిం కుటుంబాలకు జంజనం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

362
0

చీరాల : పేరాల మసీద్ సెంటర్ లో జండాచెట్టు దగ్గర రంజాన్ పండుగ సందర్భముగా 350ముస్లీమ్ మైనారిటీ కుటుంబాలకు ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తన ఇద్దరు కుమార్తెల సహకారంతో నిత్యావసర సరుకులను వైసిపి యువనేత కరణం వెంకటేష్ బాబు, ఎమ్యెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి అమృతపాణి చేతులమీదుగా పంపిణీ చేశారు.

ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు లండన్ లో నివాసం ఉంటున్న మొదటి కుమార్తె ఉమాదేవి, అమెరికాలో ఉన్న రెండవ కుమార్తె మాధురి ఇద్దరు కుమార్తెల సహయ సహాకారములతో రంజాన్ తోఫా 350మంది ముస్లిం మైనారిటీ కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమంలో బలగంశెట్టి అంకమ్మరావు, షేక్ సలీమ్, గంజి గాంధీ తదితరులు పాల్గొన్నారు.