కొండపి : కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తన స్వగ్రామమైన గోగినేనివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన 100కుటుంబాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, చింతల గ్రానైట్స్ అధినేత చింతల వెంకటేశ్వర్లు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం, నూనె, కూరగాయలు, కోడిగుడ్లు, ఫ్రూట్స్, నిత్యవసర సరుకులను ఇంటింటికి తిరిగి తనే స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సమయంలో తన గ్రామంలోని పేదలకు తనవంతు చేయూతగా 10 రోజులకు సరిపడ సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. కరోనా కష్టకాలంలో నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు కూడా ఒక్కొక్క పోలీస్ కు 25కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేసివున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోగినేని వెంకటేశ్వర్లు, చింతల సుబ్బారావు, మామిళ్ళ శ్రీహరి, కొండయ్య పాల్గొన్నారు.