చీరాల : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దోగుపర్తి వెంకట సురేష్ ఈనెల 15న నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో ప్రధమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు రోటరీ కమ్యూనిటీ హాలు నందు సన్మానం చేసి, నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వెంట తల్లి, దండ్రులు, ఒక ఉపాధ్యాయుడు కూడా రావచ్చని తెలిపారు. హాజరైన అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పందిళ్ళపల్లి జెడ్‌పి హైస్కూల్ నందు 10వ తరగతిలో 596 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించిన సజ్జా దివ్యశ్రీని రోటరీ సీనియర్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ సన్మానం చేసి రూ.11,116 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 98661 37914 నెంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో దోగుపర్తి వెంకట సురేష్, పోలుదాసు రామకృష్ణ, మామిడాల శ్రీనివాసరావు, జివై ప్రసాద్ పాల్గొన్నారు.