చీరాల : విద్యుత్ షాక్‌తో విజయనగరకాలనీకి చెందిన ప్రవేటు లైన్‌మెన్ జడా సునీల్ (29) మృతి చెందాడు. విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద కూలి పని చేస్తున్న అతను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన పేరాల జక్కావారి వీధిలో శనివారం జరిగింది. ఐక్యనగర్‌కు చెందిన జోషి అనే ప్రయివేట్ కాంట్రాక్టర్ వద్ద కరెంటు పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం యధావిధిగా పనికి వెళ్లిన సునీల్ కరెంటు స్తంభం ఎక్కి ఎల్‌టికు సంబందించిన పనిచేస్తున్నాడు. అదే సమయంలో మరో చోట 33కెవి పని చేస్తున్నారు. లైన్‌మెన్ అరగంట సమయం వరకు విద్యుత్ రాదని ఎల్‌సి ఇచ్చామని చెప్పటంతో మృతుడు సునీల్ సునీల్ పని చేస్తున్నాడు.
అయితే పనిచేస్తున్న సమయంలో విద్యుత్ రావటంతో ఒక్క సారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడే కుప్ప కూలి కరెంట్ తీగలపై వేలాడాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది క్రిందకి దింపి ప్రథమ చికిత్స అందించే లోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.
కుటుంబానికి ఆదరువుగా ఉన్న కుమారుడు కళ్ళ ముందు జీవచ్ఛవంలా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు తిల్ల, డిల్లి పోతున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోని, న్యాయం చేయాలని కాలనీ పెద్దలు కోరుతున్నారు. గతంలో కూడా విజయనగర్ కాలనీకి చెందిన సామ్యూల్ అనే యువకుడు ఇదే తరహాలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కరెంట్ తీగలపై వేలాడుతూ మృతి చెందాడు. కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు, కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.