Home క్రీడలు విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో ప్రవేట్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్

విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో ప్రవేట్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్

521
0

చీరాల : ప్రవేట్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సభలో ప్రిన్సిపాల్ మన్నెపల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శరీర దారుధ్యంతోపాటు మానశిక వికాసానికి దోహదపడతాయని చెప్పారు. ఆటలు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీస్తుందన్నారు. మైదానంలో ఆడే ఆటలు శరీర దారుధ్యంతోపాటు ఆరోగ్య వంతమైన జీవనం అలవాటవుతుందన్నారు.

విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. పరిపూర్ణమైన మానవులుగా ఎదగాలని కోరారు. ఆటలవల్ల ఐకమత్యం, ఒత్తిడిని తట్టుకునే లక్షణం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. కార్యక్రమంలో ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తేజ శ్రీనివాసరావు, గౌతమి విద్యాసంస్థల అధినేత ముట్టే వెంకటేశ్వర్లు (ఎంవి), సెక్రటరీ జి సాయి, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.