Home క్రైమ్ హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష

48
0

చీరాల (Chirala) : మండలంలోని ఈపురుపాలెంలో కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ మస్తాన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడికి న్యాయమూర్తి శిక్ష విధించారు. మస్తాన్‌పై అదే గ్రామానికి చెందిన షేక్ వదూద్ గత జనవరి 17న దాడి చేశాడు. ఈ కేసు విచారణ అనంతరం నిందితుడు షేక్ వదూద్‌పై నేరం రుజువైంది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 307 క్రింద ఒక ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ జి ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ కేసులో పటిష్టమైన దర్యాప్తు చేసి నిర్ణీత కాలంలో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. నేరాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని తెలిపారు.