Home ప్రకాశం ముగిసిన గ్రంధాల‌య వారోత్స‌వాలు

ముగిసిన గ్రంధాల‌య వారోత్స‌వాలు

1016
0

చీరాల : గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు స‌భ‌లో క‌మీష‌న‌ర్ షేక్ ఫ‌జులుల్లా మాట్లాడారు. విద్యార్ధులు నిత్య పఠనం ద్వారా మరింతగా విఙ్ఞానాన్ని పెంచుకోవచ్చని అన్నారు. ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన స‌భ‌లో విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. పోటీ పరీక్షలకు తయారయ్యే పేద విద్యార్థులకు గ్రంథాయాలు దేవాలయాల్లాంటివని అన్నారు.

గ్రంధాలయ అభివృద్ధి కమిటి డాక్టర్‌ పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని అన్నారు. గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వ్యాసరచన, వక్త్వృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. చిన్నారులు, గృహుణిలు పుస్తక పఠనం చేయ‌డం ద్వారా మానసిక ఉల్లాసం క‌లుగుతుంద‌న్నారు. గ్రంథాలయ పాలకుడు పావులూరి జానకీ రామారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్‌ 14 నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్య‌క్ర‌మంలో ప్రధానోపాధ్యాయులు ఆలూరి వెంకటేశ్వరరావు, పీవీ సాయిబాబు, పవని భాను, బండారు నాగేశ్వరరావు పాల్గొన్నారు.