Home బాపట్ల వృద్ధ ఆశ్రమానికి బియ్యం బహుకరణ 

వృద్ధ ఆశ్రమానికి బియ్యం బహుకరణ 

25
0

చీరాల (Chirala) : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు అమరా వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా కోటయ్య అనాధ వృద్ధాశ్రమంలోని పిల్లల అన్నదానం కొరకు ఒక బస్తా బియ్యం, శ్రీ మహాదేవ వేద పాఠశాలలోని విద్యార్థుల పోషణ నిమిత్తం రూ.2,500 నగదు అందజేశారు. వాకింగ్ సభ్యులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, మధు, రమేష్, పుల్లయ్య నాయుడు, ప్రసాద్, రాముడు, సుబ్బారావు, బుల్లిబాబు, చెంగలరాయుడు, శ్రీనివాసరావు, రమణారావు, రవి, రామబ్రహ్మం, నాగవీర భద్రాచారి, బదిరి, నరసింహరావు, ప్రసాదరావు, కృష్ణమూర్తి, వీరాంజనేయులు, శివాంజనేయప్రసాద్, తుకారాం పాల్గొన్నారు.