చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొనుగాలదారుల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తడంతో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ మంగళవారం రెండు గంటలు పట్టణంలో పర్యటించారు. కిరాణా వ్యాపారులకు ధరల పట్టిక బయట పెట్టాలని అధిక ధరలకు సరకులు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో జిల్లా పరిపాలనాధికారి పోలా భాస్కర్ దృష్టికి చీరాలలో కిరాణా వ్యాపారులు నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం వెళ్లగా చీరాలలో ఉన్న వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం మునిసిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, చీరాల వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగొరీ మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి ఒకటో పట్టణ సిఐ నాగమల్లేశ్వరరావు కమిటీ డైరెక్టర్ల తోను, కిరాణా మార్చంట్స్ అసోసియేషన్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.
ఈసమావేశంలో కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ వ్యాపారులు తమ వద్ద మీరు చెప్పినట్లుగా ధరల పట్టికను ముద్రించడానికి తగు పైకం అందుబాటులో లేవు. అంతేకాక ముద్రణా దుకాణాలు సైతం నిరవధికంగా మూసివేసి ఉన్నందున ఇబ్బందిగా ఉందని సమాధానం ఇవ్వగా వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగొరీ తన స్వంత నిధులతో పట్టికను ముద్రించి అధికారుల సమక్షంలో అందచేశారు.