Home ప్రకాశం వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు

వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు

10
0

అద్దంకి (DN5 News) : సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 71వ తిరుణాల మహోత్సవం 2వ రోజు ఘనంగా నిర్వహించారు. (Singarkonda Prasannanjaneya swami) కూచిపూడి నృత్యం, భక్తజన బృందం కోలాటాలు భక్తులను ఎంతగానో అలరించాయి. స్వామివారికి ప్రత్యేక వేద పాఠశాల విద్యార్థులచే ప్రత్యేక వేద పఠణం నిర్వహించారు. స్వామివారి ఉష్ణ వాహన సేవ కోసం భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల కోసం టిటిడి (TTD) కళ్యాణ మండప సమీపంలో భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి మదమంచి తిమ్మనాయుడు తెలిపారు. వచ్చిన వారికి లేదనకుండా అన్నదానం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తుల కోసం తిరుపతి నుండి వచ్చిన వంట నిష్ణాతులతో లడ్డు తయారు చేయించి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

తిరునాళ్లకు తొమ్మిది లక్షల ప్రజలు వచ్చే అవకాశం అవకాశముందని తెలిపారు. లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారనే అంచనాతో మరిన్ని సేవా కార్యక్రమాలు, వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులుకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. దేవస్థానం వద్ద భక్తులు క్యూ లైన్ లోనే స్వామివారిని దర్శించుకునే విధంగా కొత్తగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామి వారి అభిషేక కార్యక్రమంలో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ చుండూరి మురళి సుధాకరరావు దంపతులు, సభ్యులు నూతి లక్ష్మీప్రసాద్, సురేష్ బాబు, గోపి పాల్గొన్నారు.