Home జాతీయం ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ @ సూర్యలంక : యుద్ధ విమానాల కేంద్రం ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ @ సూర్యలంక : యుద్ధ విమానాల కేంద్రం ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు

468
0

అమ‌రావ‌తి : రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి అత్యంత స‌మీపంలో ఉన్న స‌ముద్ర తీరం చీరాల‌, బాప‌ట్ల‌. ఈ పాటికే సూర్య‌లంలో భార‌త వాయుసేన ప్ర‌యోగ శిక్ష‌ణా కేద్రం నిర్వ‌హిస్తుంది. అలాంటి సూర్యలంక డిఫెన్స్ కేంద్రాన్ని భార‌త‌ వైమానిక యుద్ధ విమానాల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేశంలో ఉన్న ఒకేఒక్క‌ వాయుసేన క్షిపణి పరీక్ష కేంద్రం సూర్య‌లంక‌లో ప్ర‌స్తుతం ఉంది. క్షిపణులు, బాంబులను పరీక్షించేందుకు తీసుకొచ్చే యుద్ధ విమానాల కోసం కర్లపాలెం మండలం పేరలిలో 2500 ఎక‌రాల‌ పరిధిలో ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

డీఆర్‌డీవో ఆధ్వర్యంలో కృష్ణ‌జిల్లా నాగాయ‌లంక‌లో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో క్షిపణులు, బాంబుల పరీక్ష కేంద్రానికి అడుగులు వేయ‌డటం సంతోషించ‌ద‌గిన విష‌యం. సూర్యలంక డిఫెన్స్‌ కేంద్రం గ్రూపు కమాండరు, గ్రూపు కెప్టెన్‌ ఆర్‌ఎన్‌ కుమారస్వామి మంగళవారం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుని కలిసి కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. ఫైరింగ్ రేజికోసం సేకరించే భూమిని రెవెన్యూ, వైమానికదళ అధికారులు సోమవారం పరిశీలించారు.

1500ఎక‌రాల అట‌వీ భూమిని సేక‌రించి 1968లో సూర్యలంకలో భార‌త‌ వాయుసేనా (ఎయిర్‌ఫోర్స్‌) కేంద్రాన్ని రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. ఇక్క‌డ ఏటా సముద్రంపై ఆకాశంలో క్షిప‌ణీ పరీక్ష‌ల ప్ర‌యోగాలు చేస్తుంటారు. ప్ర‌తిఏటా మూడు నెలలపాటు ఈ పరీక్షలు చేస్తారు. తూర్పుతీరం రక్షణకు అత్యంత కీలక ప్రాంత‌మైన‌ సూర్యలంకలో హెలీప్యాడ్‌ మాత్రమే ఉంది. యుద్ధ విమానాలు దిగేదందుకేనువైన‌ రన్‌వే, ఇతర మౌలిక స‌దుపాయాలు లేవు. యుద్ధ విమానాలను సైతం నిలిపేవిధంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే ప్ర‌తిపాద‌న‌లు రెండు ద‌శాబ్దాలుగా అమ‌లుకు నోచుకోలేదు.

సూర్య‌లంక నుండి క్షిప‌ణి పేల్లేందుకు అవ‌స‌ర‌మైన ల‌క్ష్యాన్ని హైదరాబాద్‌ సమీపంలో దుండిగల్‌ నుండి వైమానికదళ హెలికాప్టర్‌ సూర్యలంక వ‌ద్ద‌ సముద్రంపై జారవిడిస్తే ఇక్క‌డి నుండి క్షిపణులను ప్రయోగించి పేల్చి వేసే పరీక్షలు చేస్తున్నారు. క్ష‌పిణి ప్ర‌యోగ సమయంలో సముద్రంలో చేపల వేట నిషేధిస్తారు. ఇక్క‌డి ఎయిర్‌ఫోర్స్ కేంద్రాన్ని అభివృద్ది చేసేందుకు డిఫెన్స్ శాఖ నిర్ణ‌యించింది.

సూర్య‌లంక చుట్టూ అట‌వీశాఖ‌కు చెందిన బంజ‌రు భూములే ఉన్నాయి. ఫైరింగ్ రేజికి 3500ఎక‌రాల భూమి కావాల‌ని డిఫెన్స్ అధికారులు ప్ర‌తిపాదించారు. అయితే అట‌వీ భూములు సేకరించటం క్లిష్టమైన ప్రక్రియ. భూసేక‌ర‌ణ జాప్యం జ‌రిగే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. సూర్యలంకకు సమీపంలో కర్లపాలెం మండలంలోని పేరలిలో ఉన్న‌ ప్రభుత్వ అసైన్డ్‌, పట్టా భూములు 2,500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. వీటితోపాటు అటవీ శాఖకు చెందిన మరో వెయ్యి ఎకరాలను తీసుకునేందుకు అనుమతి కోరాల‌ని భావిస్తున్నారు. దానికోసం ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ ఆర్‌ఎన్‌ కుమారస్వామి, బాపట్ల, కర్లపాలెం తహశీల్దార్లు వల్లయ్య, వెంకట ప్రసాద్‌ పేరలిలో సేకరించదలిచిన భూములను పరిశీలించారు. నివేదికను సిద్ధం చేసుకుని సీఎం చంద్రబాబును కలిసి ఫైరింగ్‌ రేంజ్‌ భూసేకరణపై చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం పొందితే అధికారులు భూసేకరణ ప్రక్రియ మొద‌లు పెడ‌తారు. ఫైరింగ్ రేంజి వ‌స్తే సూర్యలంక – పేరలి ప్రాంతాలు కీలకం కానున్నాయి. సముద్రంపైన క్షిపణి, బాంబుల కీలక పరీక్షలు ఇక్క‌డినుండే చేస్తారు. ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డంతో బాప‌ట్ల‌, చీరాల ప్రాంతాల్లో అభివృద్ది జ‌రిగే అవ‌కాశాలున్నాయి.