Home ప్రకాశం ప్రకాశం మాజీ జెడ్పి చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య కన్నుమూత

ప్రకాశం మాజీ జెడ్పి చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య కన్నుమూత

795
0

ఒంగోలు : మాజీ జడ్పి చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య మంగళవారం సాయంత్రం మృతిచెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఒంగోలులోని ఆయన గృహంలో ఉంచిన ఆయన పార్థివదేహానికి కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య, టంగుటూరు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, టీడీపీ నాయకులు కామని విజయ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు నివాళులర్పించారు.