చీరాల : మాజీ శాసనసభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, చేనేత, వ్యవసాయ రంగాల ముద్దుబిడ్డ, ప్రజాబందు ప్రగడ కోటయ్య 29వ వర్ధంతిని సందర్బంగా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం పట్టణంలోని కోటయ్య విగ్రహానికి తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులతో ఘనంగా నివాళి అర్పించారు. చేనేత రంగానికి దేశ వ్యాప్తంగా కోటయ్య ఎనలేని సేవ చేశారని కొనియాడారు. చీరాల నియోజకవర్గంలో వ్యవసాయ దారులకు ఎత్తిపోతల పధకాల ద్వారా సాగునీరు అందించారని అన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కౌత్రపు జనార్దనరావు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, అనపర్తి రత్నబాబు, కౌన్సిలర్ సుబ్బయ్య, కొండు రత్నబాబు, గుమ్మా వెంకటేష్, పెడవల్లి శంభుప్రసాద్, నరాల తిరపతిరాయుడు, తేలప్రోలు నాగేశ్వరావు, పలగర్ల మస్తాన్రావు, విష్ణుమొలకల మధుబాబు, లావేటి శ్రీనివాసతేజ, దావీదు, కట్టా ఆనందు, బొమ్మిడి నాగరాజు, కట్టెం వంశీకృష్ణ, గుత్తికొండ కిషోర్ పాల్గొన్నారు.