చీరాల : ప్రగడ కోటయ్య 23వ వర్థంతి సభను కోటయ్య విగ్రహం వద్ద సోమవారం నిర్వహించారు. సభకు దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు. తొలుత కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో నాయకులు మాట్లాడుతూ చట్టసభలలో బీసీల గురించి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ప్రగడ కోటయ్యని అన్నారు. కోటయ్య ఒక జాతికి కానీ మతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. 23ఏళ్ల తర్వాత కూడా కోటయ్య గురుంచి చెప్పుకుంటున్నామంటే వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కోటయ్య చేశిన కృషేనన్నారు.
ఇంకో 120 ఏళ్ల తర్వాత కూడా కోటయ్య గురించి రాబోయే తరాలు చెప్పుకుంటాయన్నారు. రాజకీయాలలో కూడా చేనేతల సమస్యలపైనే కాకుండా రైతాంగ సమస్యలపై కూడా పోరాడారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు, డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, సీనియర్ న్యాయవాది ఎంగల కోటేశ్వరరావు(వైకే), కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, యతాం ఆనందరావు, దామర్ల ఉమ మహేశ్వరరావు, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, వైసిపి చేనేత విభాగం నాయకులు బీరక సురేంద్ర, సిపిఐ కార్యదర్శి మేడ వెంకటరావు పాల్గొన్నారు.