టంగుటూరు (దమ్ము) : వైసీపీ మండల మాజీ అధ్యక్షులు సూదనగుంట హరిబాబు తన సొంత నిధులతో టంగుటూరు వైసీపీ నాయకులు సోమేపల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోతుల వెస్ట్ కాలనీలో జంగిల్ క్లియరెన్స్ చేయించారు. పోతుల వెస్ట్ కాలనీలో ఇండ్ల మధ్యలో ఖాలీగా ఉన్న స్థలాల్లో చిట్టడవిలా పెరిగిపోయిన చిల్లచెట్ల గుట్టలను తొలగించారు. పాములు, అడవిపందులకు ఆవాసాలుగా మారడంతో అక్కడ నివాసం ఉంటున్న పేదలకు ప్రమాదకరంగా మారింది. ఇండ్లలోకి సైతం పాములు, పందులు చొరబడుతుండంటంతో భయంతో బిక్కు బిక్కుమంటూ పిల్లలు, ముసలివాళ్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రజలు టంగుటూరు వైసీపీ మాజీ అధ్యక్షులు సూదనగుంట హరిబాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి తన సొంతనిధులతో ప్రొక్లైన్ ఏర్పాటు చేసి టంగుటూరు వైసీపీ నాయకులు సోమేపల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలో చిల్లచెట్లను వేర్లతో సహా తొలగించారు. ఈసందర్భంగా వెస్ట్ కాలనీ ప్రజలు హరిబాబు, మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.