చీరాల : ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా పేరాల ఏ ఆర్ ఎం ఉన్నత పాఠశాలలో మున్సిపల్ ఉపాధ్యాయులకు జరుగుతున్న ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉపాధ్యాయులతో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా, పట్టణ శాఖ అధ్యక్షులు ఎస్ వి సుబ్బారెడ్డి, అధ్యక్షులు ఎన్ రాజేష్, మహిళా సహాధ్యక్షులు సిహెచ్ మాధవి, మహిళా కార్యదర్శులు డి లలిత ప్రియ, రోహిణి, సుమలత, జ్యోతిర్మయి, కార్యదర్శులు సయ్యద్ జానీభాషా, టి జనార్దన్ రావు, జె రాంబాబు, నారపరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి ఉపాధ్యాయులతో మాట్లాడి పీఆర్సీ అమలుచేయాలి, సీపీఎస్ రద్దు చేయాలి, 4 విడతల డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రికి పంపడం జరిగింది. జిల్లాకార్యదర్శి షేక్ జానీ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యోగ ఉపాధ్యాయుల మన్ననలు పొందాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు చేసి, పాతపెన్షన్ అమలుకు విధివిధానాలు ప్రకటించాలని, పీఆర్సీ అమలుకు బడ్జెట్ కేటాయించి అమలుపరచాలని, ఎన్నడూ లేనంతగా జాప్యమయిన 4విడతల డీఏ బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.