Home ప్రకాశం కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి

కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి

456
0

చీరాల : కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కొత్తపేట జడ్పి ఉన్నత పాఠశాల హెచ్ఎం ఇందిరా ఇజ్రాయెల్ కోరారు. ప్రపంచ కాలుష్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రొటెక్ట్ సహాయంతో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు.

1984 డిసెంబర్ 3న భోపాల్లో జరిగిన రసాయన దుర్ఘటన భవిష్యత్ లో మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనమందరం జాగ్రత్తగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణకు ఎన్ని చట్టాలు వచ్చిన వాటిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. ప్రొటెక్ట్ సంస్థ రిసోర్స్ పర్సన్ ఏలీయా మాట్లాడుతూ ప్రజలు చైతన్య వంతులై పాల్టీన్ కవర్ ల వాడకాన్ని మానుకోవాలని కోరారు.

చిన్నప్పటినుండి తడి చెత్త పొడి చెత్తపై అవగాహన పెంచుకోవలన్నారు. కాలుష్య నివారణకు మొక్కల నాటడంతోనే మన అందరి బాధ్యత తీరిపోదని, నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో పవని బానుచంద్రమూర్తి, బాలకృష్ణ, ఖురేషి, బిక్షాలుబాబు పాల్గొన్నారు.