న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆదివారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
నిన్న అఖిలేష్ యాదవ్, మాయవతితో జరిపిన చర్చల సారాంశంపై రాహూల్తో జరిగిన సమావేశంలో చర్చలు జరిపినట్లు సమాచారం. రాహుల్‌తో చంద్రబాబు సుమారు 20 నిముషాలపాటు చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. మరి కాసేపట్లో చంద్రబాబు ఎన్సీపీ అధినేత శరద్‌పవర్‌తో భేటీ కానున్నారు. రేపు గానీ, ఎల్లుండిగానీ మళ్లీ సమావేశం కావాలని రాహుల్, చంద్రబాబు నిర్ణయించారు. ఇవాళ రాత్రి చంద్రబాబు విజయవాడకు వెళ్లనున్నారు. రేపు (సోమవరం) రాత్రి మళ్లీ ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి (మంగళవారం) సోనియాగాంధీ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందు కోసం ఏపీభవన్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియవచ్చింది.