మార్టూరు (దమ్ము) : జొన్నతాళిలో అక్రమంగా మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న గొర్రె పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మార్టూరు ఎస్ఐ ఎంవి శివకుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని జొన్న తాళి గ్రామాన్ని సందర్శించి తనిఖీ చేయగా అక్కడ గొర్రె పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా 22క్వార్టర్ మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచుకొని ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎంవి శివకుమార్ తెలిపారు.