చీరాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వాడరేవు తీరానికి తరలి వచ్చారు. వేకువజామునుండి మొదలైన సముద్ర స్నానాలు సాయంత్రం వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. సముద్ర స్నానం ఆచరించిన భక్తులు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లను పంచాయితీ అధికారులు ఏర్పాటు చేశారు. సముద్రంలో లోతుకు వెళ్లకుండా ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్‌పి వల్లూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో రూరల్ సిఐ పి భక్తవత్సలరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.