Home బాపట్ల కానిస్టేబుల్ పోస్టు సాధించిన పేదింటి బిడ్డ

కానిస్టేబుల్ పోస్టు సాధించిన పేదింటి బిడ్డ

343
0

చీరాల : సివిల్ కానిస్టేబుల్ ఫలితాల్లో పేదింటి యువతి పోస్టు సాధించ్చారు. సరైన వనరులు లేకున్నా పోలీసు కావాలన్నా పట్టుదలతో కష్టపడి ఉద్యోగం సాధించి తోటి వారికి ఆదర్శంగా నిలిచింది. తండ్రి టైలర్ వృత్తి చేసుకుంటూ కుటుంబం గడుపుతుండగా తాను పోలీసు కావాలన్న కల నెరవేర్చుకోవడం కోసం చేసిన కష్టం నిన్న విడుదల చేసిన పోలీసు కానిస్టేబుల్ల ఫలితాల్లో ప్రతిబింబించింది.

పట్టణంలోని వైకుంటపురంలో నివాసముంటున్న మేకపోతుల కృష్ణారావు టైలర్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన భార్య లావణ్య తన టైలర్ వృత్తికి సహాయపడుతుంది. వీరి కూతురు మేకపోతుల పావని మహేశ్వరి డిగ్రీ అనంతరం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న ఆమె పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి అవసరమైన శారీరక దారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రాత పరీక్షలోనూ అర్హత సాధించి ఉద్యోగం పొందారు. దీంతో అంతంత మాత్రపు ఆర్థిక వనరులతో కష్టపడి ఉద్యోగం సాధించిన ఆమెను మిత్రులు, బంధువులు అభినందించారు.